ములుగు: పదోతరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 10మండలాల్లో 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 30,134 మంది రెగ్యూలర్, ఇద్దరు ప్రైవేట్‌గా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నేటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు కొనసాగనున్నాయి. విద్యాశాఖ, పోలీస్, వైద్య, విద్యుత్, ఆర్టీసీ శాఖలు సమన్వయంగా పనిచేయనున్నాయి. ఈ మేరకు గురువారం డీఎస్పీ నలువాల రవీందర్ ఆయా సెంటర్లను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
నిఘా నీడలో పరీక్ష పత్రాల ఓపెన్
అన్ని పరీక్ష కేంద్రాల్లోని చీఫ్ సూపరింటెండెంట్ రూంలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లకు చేరుకున్న ప్రశ్నపత్రాలను పోలీసుల బందోబస్తు నడుమ పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు, సీసీ కెమెరాల ముందు ఓపెన్ చేసి పరీక్ష ముగిసిన తర్వాత అక్కడే ప్యాకింగ్ చేసి పోస్టాఫీస్‌కు తరలిస్తారు. కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదు. పరీక్షల నిర్వహణకు జిల్లాను రెండు రూట్లుగా విభజించారు.
మండలాలు 10
పరీక్ష కేంద్రాలు 21
మొత్తం విద్యార్థులు 3136
చీఫ్ సూపరింటెండెంట్లు 21
ఇన్విజిలేటర్లు 170
ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 2
సిట్టింగ్ స్క్వాడ్‌లు 9
నేటి నుంచి
ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహణ
హాజరుకానున్న 3,136 మంది విద్యార్థులు
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం