ఎస్‌ఎస్‌తాడ్వాయి: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందిస్తుందని డీపీఎం గోవింద్‌చౌహన్ అన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం క్లాత్‌ను మహిళా సంఘాల్లోని మహిళలకు ఇన్‌చార్జ్ ఎంఈఓ రేగ కేశవరావుతో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి మహిళలతో యునిఫాంలు కుట్టిస్తుందని వివరించారు. పాఠశాలల పునర్ ప్రారంభానికి ముందుగానే యూనిఫాంలు పాఠశాలల్లోని విద్యార్థులకు అందించాలన్నారు. కార్య క్రమంలో ఏపీఓ శ్రీనివాస్‌రావు, మండల సమాఖ్య అధ్యక్షురాలు మానస, వీఓ సంఘం అధ్యక్షురాలు కొట్టెం మల్లికాంబ తదితరులు పాల్గొన్నారు.