ఎకరాలు
జిల్లాలో బాండ్ మొక్కజొన్న పంటనష్టం
నేడు కలెక్టర్‌కు నివేదిక
కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో మొక్కజొన్న పంటనష్టం వాటిల్లినట్లు వచ్చిన ఆరోపణలతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 7బృందాలతో సర్వే చేపట్టాం. మొక్కజొన్న ఫీల్డ్‌లో నమూనాలు సేకరించాం. వాటిని వ్యవసాయశాఖ ల్యాబ్‌కు పంపించాం. వారం పది రోజుల్లో పూర్తిస్థాయి ఆధారాలు అందుతాయి. నేడు (సోమవారం) పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నాం.
– సురేశ్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ఎకరాకు టన్నున్నరే
దిగుబడి వచ్చింది..
ఈ ఏడాది 4 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. పెట్టుబడికి రూ.1.30లక్షల ఖర్చు వచ్చింది. పంట వేసే ముందు ఆర్గనైజర్లు ఎకరానికి 3 నుంచి 4టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. కాని నాకు టన్నున్నర మాత్రమే దిగుబడి వచ్చింది. అధికారులు స్పందించి నష్ట పరిహారం అందించేలా చూడాలి.
– రాంబాబు, యోగితానగర్
ములుగు: జిల్లాలోని కన్నాయిగూడెం, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో బాండ్ మొక్కజొన్న వ్యవసాయం పేరుతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగినట్లు వచ్చిన ఆరోపణలు నేడు కొలిక్కి రానున్నాయి. ఈ మండలాల్లోని రైతులు 7నుంచి 8ఏళ్లుగా బాండ్ వ్యవసాయం చేస్తున్నారు. గతంలో కొంతమంది రైతులకు దిగుబడి తగ్గిన సమయంలో ఆయా కంపెనీల యాజమాన్యాలు నష్ట పరిహారాన్ని అందించాయి. అయితే ఈ ఏడాది ఏకంగా వందల ఎకరాల్లో పంటనష్టం రావడంతో ఫిబ్రవరి 17న రైతులు వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించారు. ఈ మేరకు జిల్లా అధికారులు సర్వేను ప్రారంభించి.. కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు గత నెల 25న తుది నివేదిక అందించారు. తదనంతరం మరికొంతమంది రైతులు నష్టపోయామని ముందుకు రావటంతో ఈనెల 6వ తేదీ వరకు మొక్కజొన్న పంట క్షేత్రాల నుంచి సీడ్ నమూనాలను సేకరించిన అధికారులు 13వ తేదీ వరకు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ క్రమంలో ఏడు బృందాలుగా ఏర్పడి కంపెనీ ప్రతినిధులు రైతులతో పంట పొలాలకు వెళ్లి నమూనాలను సేకరించారు. వీరికి ఏఓ సూపర్‌వైజర్‌గా వ్యవహరించారు.
నష్టాలను చెల్లిస్తూ వచ్చిన కంపెనీలు
ఏజెన్సీలో 7నుంచి 8ఏళ్లుగా బాండ్ మొక్కజొన్న పంటసాగు జరుగుతోంది. సాధారణంగా ఎకరాకు 3నుంచి 4టన్నుల దిగుబడి వస్తుంది. గతంలో ఈ లెక్క ప్రకారం దిగుబడి తక్కువగా వచ్చిన రైతులకు కంపెనీలు నష్టపరిహారం చెల్లిస్తూ వచ్చాయని తెలుస్తోంది. ఈ ఏడాది పంట నష్టపోయిన వారికి సైతం విత్తనాలను అందించిన సింజెంటా, బెయర్, హైటెక్, నూజువీడు, సీపీ సీడ్స్ ప్రతినిధులు డబ్బులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ ఎదుట చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఏజెన్సీలో 1/70 చట్టం అమలులో ఉండటంతో ఆయా కంపెనీలు ఆర్గనైజర్ పేరుతో బాండ్ తీసుకున్నారు. బయట మార్కెట్‌లో క్వింటా మొక్కజొన్నకు రూ.2,100 ధర ఉండగా ఆర్గనైజర్లకు ప్రాంతాన్ని బట్టి రూ.2,800నుంచి 3వేల వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయంలో రైతులు సానుకూలంగా ఉన్నా కొన్ని సంఘాలు రెచ్చగొట్టి సమస్యను తీవ్రం చేశాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీటీ మొక్కజొన్న సీడ్‌తోనే నష్టమా?
ఇప్పటి వరకు పత్తి విత్తనాలను మాత్రమే బీటీ(బాసిల్లసిస్ తురంజసీస్) రకాన్ని పత్తిలో మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ మొక్కజొన్నలో బీటీ పేరుతో కొత్త వంగడం మార్కెట్‌లోకి రావటంతో ఏజెన్సీ రైతులు సాగుచేశారు. నిబంధనల మేరకు జనిటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ(జేబీఏసీ) అనుమతి తప్పనిసరిగా ఉండాల్సి ఉంది. దీంతో పాటు ఎన్వీరాల్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2005 ప్రకారం తీవ్ర పరిణామాలు ఉంటాయని వ్యవసాయ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బీటీ సీడ్స్ పేరుతో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉండే ప్రమాదం ఉంది. ఈ విషయంలో వ్యవసాయశాఖ అధికారులు 40రోజుల క్రితం నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. త్వరలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవటానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
మండలాలు రైతులు పంటసాగు
(ఎకరాల్లో)
కన్నాయిగూడెం 89 214
వెంకటాపురం(కె) 541 964
వాజేడు 314 748
మూడు మండలాల్లో..
944మంది రైతులు సాగు
నేడు కలెక్టర్‌కు తుది నివేదిక
హాజరు కానున్న
ఆయా కంపెనీల ప్రతినిధులు
బీటీరకం విత్తనంతోనే నష్టం వచ్చినట్లు భావిస్తున్న అధికారులు
1,926
1,926