ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025
అడుగంటుతున్న
– 8లోu
మంగపేటలో నీరు తక్కువగా పోస్తున్న బోరు
ఏటూరునాగారం: ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎండాకాలంలో ఎక్కువగా వరి పంటలు సాగుచేయడం, వాగుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపట్టడం, వాగులకు చెక్‌డ్యామ్‌లు లేకపోవడం, పరిమితికి మించి బోర్లు వేయడం వల్ల నీరు ఆవిరైపోతోంది. దీంతో బోర్లలోని నీరు లోతుకు వెళ్తుండడంతో మరింత లోతుకు బోర్లను దింపుకోవాల్సి వస్తుంది. పలుచోట్ల బోర్లు నీరు తక్కువ మోతాదులో పోస్తుండగా వాగులు ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయి.
జిల్లాలోని 10మండలాల్లో భూగర్బ జలాల నీటిమట్టాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం గ్రౌండ్ వాటర్‌శాఖ ద్వారా 40బోర్‌వెల్ పైజో మీటర్లను ఏర్పాటు చేసింది. ప్రతినెలా 15నుంచి 28వ తేదీలోపు అధికారులు, సిబ్బంది గ్రౌండ్ వాటర్ లెవల్స్ వివరాలు సేకరిస్తారు. ఎక్కడైతే 10 మీటర్ల లోపు అడుగులో నీరు ఉంటుందో అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని, 11 నుంచి 15, 15 నుంచి 20కి పైగా మీటర్లలోతుల్లో నీటి మట్టం పడిపోతే డేంజర్ జోన్‌లోకి ఆ ప్రాంతం వెళ్లినట్లుగా అధికారులు ప్రకటిస్తారు. వెంటనే అక్కడ వాటర్ రీచార్జింగ్ పద్ధతిని చేపడుతారు.
బీరెల్లి, అబ్బాపూర్, జాకారంలో స్వల్ప
ప్రమాదస్థాయిలో..
జిల్లాలోని ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని బీరెల్లిలో 16.39మీటర్ల లోతుల్లోకి నీరు వెళ్లగా ములుగు మండల పరిధిలోని అబ్బాపూర్, జాకారంలో 24.11 మీటర్ల లోతుల్లోకి భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో స్వల్ప ప్రమాద స్థాయికి నీటి నిల్వలు చేరాయి.
నీటి నిల్వల పెంపు రికవరీ ఇలా..
వాగుల్లో ఇరిగేషన్ శాఖ ద్వారా చిన్న తరహా చెక్‌డ్యామ్‌లను నిర్మించి నీటి నిల్వలను పెంచాలి. చెరువుల్లో పూడిక తీయించి నీటి నిల్వ, లీకేజీలు లేకుండా చూడాలి. అంతేకాకుండా బోరు బావులను ఎక్కడబడితే అక్కడ వేయకుండా నిరోధించాలి. అలాగే గ్రామాల సమీపంలోని వాగుల్లో ఇసుకను తోడకుండా నివారించి వాగుల్లో నీరు ఆవిరికాకుండా చూడాలి. గోదావరిలో ఇసుక తవ్వకాలను పూర్తిగా నిలిపివేస్తే నీటిమట్టం పడిపోకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
న్యూస్‌రీల్
గంజాయి, పశువులను రవాణా చేస్తే చర్యలు
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ
ప్రాంతం జనవరి ఫిబ్రవరి
ఏటూరునాగారం 12.40 13.11
శంకరాజుపల్లి 12.75 13.39
ముప్పనపల్లి 9.49 11.20
కమలాపురం 11.84 12.11
జాకారం 20.09 24.11
బీరెల్లి 15.61 16.39
అబ్బాపూర్ 20.09 24.11
జగన్నాథపురం 11.50 12.94
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వట్టిపోతున్న వాగులు, చెరువులు
ప్రతినెలా గ్రౌండ్ వాటర్ లెవల్స్ పరిశీలిస్తున్న అధికారులు
ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి
వేసవిలో వరి పంటలను అత్యధికంగా సాగు చేయడం మూలంగా నీటిని ఎక్కువగా పంట పొలాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల భూ గర్భజలాలు పడిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమని రైతులు ఆరుతడి పంటలను సాగు చేసేందుకు మొగ్గుచూపితే కొంత మేర నీటి నిల్వలను కాపాడుకోవచ్చు.
– శ్రీనివాస్,
భూగర్భ జలశాఖ జిల్లా అధికారి
జంపన్నవాగులో చెక్‌డ్యామ్‌లు కట్టాలి..
జిల్లాలో ప్రవహిస్తున్న జంపన్నవాగులో ప్రమాదం లేకుండా నీటి నిల్వలు పెంచేందుకు చెక్‌డ్యామ్‌లను నిర్మించాలి. దీనివల్ల నీటి నిల్వలు పెరగడంతో పాటు పంటలకు నీరు అందుబాటులో ఉంటుంది. తాగునీటి, సాగునీటి సమస్యలు రాకుండా ఉంటాయి. చెల్పాక, వీరాపురం, బన్నాజీబంధం, ఎలిశెట్టిపల్లి ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికి వాగునీటినే తాగునీరుగా ఉపయోగిస్తుంటారు.
– కాపుల సమ్మయ్య, రైతు, అల్లంవారిఘణపురం
భూగర్భ జలాలు
భూగర్భ జలాలు
భూగర్భ జలాలు
భూగర్భ జలాలు
భూగర్భ జలాలు
భూగర్భ జలాలు