బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రభుత్వం, నాయకులను కోరినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. చివరకు చల్వాయి గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మహిళా రైతులు సైతం ఉండడం గమనార్హం. దీంతో అప్పటి అధికారులు, పోలీసులు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో రైతులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
పరిహారం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు(ఫైల్)