మల్హర్: బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్ కాస్ట్ మైన్ నిర్దేశించిన 100శాతం లక్ష్యాన్ని ఒక రోజు ముందుగానే పూర్తి చేసి బొగ్గు ఉత్పత్తి సాధనలో టాప్‌గా నిలిచిందని ఏఎమ్మార్ కంపెనీ మైన్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, మైన్ మేనేజర్ కేఎస్‌ఎన్ మూర్తి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ధేశించిన 25లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌ను చేరుకున్నామని వెల్లడించారు. 25సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురిసినా కార్మికులు, ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో అన్ని అడ్డంంకులనూ అధిగమించి నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. తాడిచర్ల గని బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా రక్షణలో ముందుండి రక్షణ సంబంధిత అవార్డులను జాతీయస్థాయిలో గెలుచుకుందని తెలియజేశారు. 2019 సంవత్సరంలో జరిగిన 52వ భద్రత వారోత్సవ పోటీల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ సేప్టీ అవార్డు, అత్యంత ప్రతిష్టాత్మమైన 2021 జాతీయ భద్రతా అవార్డుకు ఎంపికై నట్లు తెలిపారు. 2020, 2021 సంవత్సరాలల్లో వరుసగా బొగ్గు మంత్రిత్వ శాఖ అందించే స్టార్ రేటింగ్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి బొగ్గుని టాప్ 10వ స్థాన సంపాందించి, దేశంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిందని పేర్కొన్నారు. మైన్ స్టేప్టీ కోసం అధికారులను, సూపర్ వైజర్స్, కార్మికులను నాగపూర్‌లోని ఎన్‌పీటీఐ ట్రైనింగ్ సెంటర్‌లో ఇన్ హౌస్ సేప్టీ ట్రైనింగ్‌కు పంపించినట్లు తెలిపారు. అవార్డులు రావడానికి, లక్ష్యసాధనకు కృషిచేసిన అధికారులు, కార్మికులను జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, డైరెక్టర్ టీఆర్కే రావు, ఏజెంట్ బాలరాజు, జీఎం మోహన్‌రావు, ఏఎమ్మార్ ఎండీ మహేష్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌లు హర్షం వ్యక్తంచేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రమాద రహిత ఉత్పత్తిని సాధిస్తూ ముందుకు సాగాలని సూచించారు.