‘ప్రాణం పోయినా నమ్ముకున్న వాళ్లను వదిలిపెట్టను’ | Yash Gajakesari Telugu Trailer Released | Sakshi
Sakshi News home page

ప్రాణం పోయినా వదిలిపెట్టను: యశ్‌

Feb 26 2021 8:43 PM | Updated on Feb 27 2021 12:06 AM

Yash Gajakesari Telugu Trailer Released - Sakshi

టాలీవుడ్‌లోనూ యశ్‌కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. దీంతో ఆయ‌న న‌టించిన సినిమాలను డ‌బ్ చేసి ఇక్క‌డ విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కేజీఎఫ్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రయ్యాడు కన్నడ హీరో య‌శ్‌‌. శాండల్‌వుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ యశ్‌కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. దీంతో ఆయ‌న న‌టించిన సినిమాలను డ‌బ్ చేసి ఇక్క‌డ విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా య‌శ్, అమూల్య‌, సాధు కోకిల ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన చిత్రం ‘గ‌జ‌కేస‌రి’. కన్నడ చారిత్రక యాక్షన్‌ చిత్ర నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను ఎస్ కృష్ణ తెర‌కెక్కించారు. 2014 మే 23న కన్నడలో విడుద‌ల కాగా, ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గజకేసరి చిత్రాన్ని మార్చి 5న తెలుగులో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేరకు తాజాగా శుక్రవారం(ఫిబ్రవరి 26) చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. 

ఇందులో ప్రాణం పోయినా నన్ను నమ్ముకున్నవారి చేయి వదిలిపెట్టను’’ అంటూ యశ్‌ చెప్పే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘‘ప్రతి తల్లీ కోరుకునే బిడ్డ.. ప్రతి రాజు గర్వపడే సేనాధిపతి..మన గజకేసరి’’, ‘‘శ్రీలంక నుంచి వచ్చానంటే మామూలు రాక్షసుడిని అనుకున్నావా.. కాదు పదితలల రావణుడుని..’’ అంటూ సాగే డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘కాలకేయ’ ప్రభాకర్‌, అనంత్‌ నాగ్‌, గిరిజా లోకేష్‌, మాండ్య రమేష్‌, జాన్‌ విజయ్‌ తదితరులు నటిస్తున్నారు.

కాగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌గా ఎదిగిపోయాడు హీరో య‌ష్‌. ‌ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌-2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందే సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది.

చదవండి: 

బాప్‌రే.. కేజీఎఫ్‌ 2 తెలుగు రైట్స్‌కి అన్ని కోట్లా?

హర్ట్‌ అయిన రకుల్‌.. ప్రమోషన్లకు దూరం!

స్పెషల్‌ డే ఫర్‌ సమంత; జీవితాన్నే మార్చేసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement