ఓటీటీలో రిలీజ్‌ కానున్న దాస్‌ కా ధమ్కీ, అప్పటి నుంచే స్ట్రీమింగ్‌ | Vishwak Sen Das Ka Dhamki Movie OTT Release Date Out | Sakshi
Sakshi News home page

Das Ka Dhamki Movie: దాస్‌ కా ధమ్కీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది, ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్‌ అంటే?

Apr 6 2023 6:50 PM | Updated on Apr 6 2023 8:53 PM

Vishwak Sen Das Ka Dhamki Movie OTT Release Date Out - Sakshi

విశ్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ (తొలిరోజు రూ.8 కోట్లు) రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. తె

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్‌, హైప‌ర్ ఆది, రంగ‌స్థ‌లం మ‌హేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కరాటే రాజు (విశ్వక్‌ సేన్‌ తండ్రి) నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదలైంది. విశ్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ (తొలిరోజు రూ.8 కోట్లు) రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కథేంటంటే..
డ‌బ్బు కోసం ఎంత‌టి దారుణానికైనా ఒడిగ‌ట్టే వ్య‌క్తి సంజ‌య్ రుద్ర‌. పుట్టిన త‌ర్వాత అనాథ‌గా మారి చాలా క‌ష్ట‌ప‌డి పెరిగి పెద్దవాడైన మ‌రో వ్య‌క్తి కృష్ణ‌దాస్‌. వీరి మ‌ధ్య జ‌రిగే పోరాట‌మే దాస్ కా ధమ్కీ. ఈ ఇద్ద‌రూ ఒకేలా ఉండ‌టం సినిమాలో ఇంట్రస్టింగ్‌ పాయింట్‌. విశ్వ‌క్ సేన్‌, హైప‌ర్ ఆది, మ‌హేశ్‌ల కామెడీతో స‌ర‌దాగా సాగిపోయే ఈ సినిమా ఇంట‌ర్వెల్ త‌ర్వాత ఎవ‌రూ ఊహించ‌ని ట‌ర్న్ తీసుకుంటుంది. అస‌లు వీరి మ‌ధ్య గొడ‌వేంటి? ధ‌న‌వంతుడు సంఘంలో పేరున్న సంజ‌య్ రుద్ర ఉన్న‌ట్లుండి కృష్ణ‌దాస్‌ను ట్రాప్ చేయాల‌న‌కున్న విష‌యాలు, క‌థ‌లో ఉండే ట్విస్టులు, ట‌ర్నులు ప్రేక్ష‌కుల‌ను కట్టిపడేస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement