ఐ మిస్‌ యూ, కన్నీళ్లతో ప్రార్థిస్తున్నా: విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Gets Emotional Over Fan Hemanth Death | Sakshi
Sakshi News home page

అభిమాని మరణంతో దుఃఖంలో విజయ్‌ దేవరకొండ

May 2 2021 8:45 AM | Updated on May 2 2021 12:14 PM

Vijay Devarakonda Gets Emotional Over Fan Hemanth Death - Sakshi

ఐ మిస్‌యూ హేమంత్‌.. నీ మధురమైన చిరునవ్వును చూశాను, నీ ప్రేమను ఫీల్‌ అయ్యాను. అదే ప్రేమను నీకు పంచాను. కళ్లలో నీళ్లు తిరగుతున్నాయి..

విజయ్‌ దేవరకొండ.. అర్జున్‌ రెడ్డి, గీతా గోవిందం వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్లే కాదు.. నోటా, డియర్‌ కామ్రేడ్‌ వంటి ఘోర ఫ్లాపులను సైతం చవి చూశాడు. కెరీర్‌ తొలినాళ్లలో హిట్లతో దూసుకుపోయిన అతడికి ఈ మధ్య సరైన విజయం దొరకడం లేదనే చెప్పాలి. అయినా సరే అభిమానులు మాత్రం అతడిని ఆరాధిస్తూనే ఉన్నారు. అంతెందుకు, బాలీవుడ్‌లోనూ విజయ్‌కు అభిమానులు ఉన్నారంటే అతడి క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అభిమానులకు ఎంతో విలువిచ్చే అతడు సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ అయ్యాడు.  కేన్సర్‌తో మంచాన పడ్డ హేమంత్‌ అనే ఫ్యాన్‌ చివరి కోరిక మేరకు అతడితో వీడియో కాల్‌ మాట్లాడిన విజయ్‌.. తాజాగా అతడు మరణించాడన్న వార్త విని చలించిపోయాడు. ఇటీవలే అతడి కోరిక మేరకు టీషర్ట్‌లు కూడా పంపాడు. దురదృష్టవశాత్తూ వాటిని వేసుకోకముందే తుది శ్వాస విడిచాడు.

"ఐ మిస్‌యూ హేమంత్‌.. నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. నీ మధురమైన చిరునవ్వును చూశాను, నీ ప్రేమను ఫీల్‌ అయ్యాను. అదే ప్రేమను నీకు పంచాను. కళ్లలో నీళ్లు తిరగుతున్నాయి. కన్నీళ్లతో నీకోసం ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. ఇతడిని నాదాకా చేరుకునేలా చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. హేమంత్‌ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను. నీ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంచుకుంటాను" అని విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశాడు.

చదవండి: కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన విజయ్‌.. కారణం ఇదేనట

Advertisement
 
Advertisement
Advertisement