
విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘విక్కీ ది రాక్ స్టార్’. సిఎస్ గంటా దర్శకత్వంలో శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టైటిల్ లోగో, వీడియోని విడుదల చేశారు మేకర్స్.కథ రిఫ్లెక్ట్ అయ్యేలా చాలా కొత్తగా ఈ రాక్ స్టార్ టైటిల్ లోగో ఉంది.
ఎరుపు రంగులో టైటిల్ డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ మేరకు విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. త్వరలోనే ఫస్ట్‌లుక్‌తో పాటు మూవీ విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రియ గుడివాడ , సాహితి, నానాజీ, రవితేజ, విశాల్, వంశీ రాజ్ నెక్కంటి, లావణ్య రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.