పవర్‌ఫుల్‌ ఫైట్‌లో... | Venkatesh Adarsha Kutumbam Movie Updates | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ ఫైట్‌లో...

May 4 2026 1:29 AM | Updated on May 4 2026 1:29 AM

Venkatesh Adarsha Kutumbam Movie Updates

వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ‘హౌస్‌ నెం: 47 (ఏకే 47)’ అనేది ఉపశీర్షిక. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ‘కేజీఎఫ్, హిట్‌ 3, తెలుసు కదా’ చిత్రాల ఫేమ్‌ శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ హై ఓల్టేజ్‌ క్లైమాక్స్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేశారట మేకర్స్‌.

ఫైట్‌ మాస్టర్‌ కెవిన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఈ పోరాట సన్నివేశం తెరకెక్కించారట. వెంకటేశ్‌పై చిత్రీకరించిన ఈ పవర్‌ఫుల్‌ ఫైట్‌ మూవీ క్లైమాక్స్‌లో వస్తుందని సమాచారం. కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం’లో మధ్యతరగతి వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు వెంకటేశ్‌. వినోదం, భావోద్వేగాల కలయికలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.  

Advertisement
 
Advertisement
Advertisement