
మెగాహీరో వరుణ్ తేజ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ ఏడాది మే నెలలో తన భార్య లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టాడు. అప్పటినుంచి ఓవైపు సినిమా చేస్తూనే మరోవైపు భార్యతో ఎప్పటికప్పుడు టూర్స్ వేస్తూనే ఉన్నాడు. ఇకపోతే పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటినుంచే షాపింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఈ విషయాన్ని స్వయంగా లావణ్య త్రిపాఠినే బయటపెట్టింది.
(ఇదీ చదవండి: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్.. 'సయారా' రివ్యూ)
నాగబాబు కొడుకు వరుణ్ తేజ్. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీస్‌తో హిట్స్ కొట్టాడు. కానీ తర్వాత నుంచి సినిమాలైతే చేస్తున్నాడు గానీ సక్సెస్ కాలేకపోతున్నాడు. గతేడాది 'మట్కా'తో వచ్చాడు కానీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఓ హారర్ కామెడీ చిత్రం చేస్తున్నాడు.
అసలు విషయానికొస్తే తనతో కలిసి సినిమాలు చేసిన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఆరేడేళ్ల పాటు ప్రేమించిన వరుణ్ తేజ్.. 2023 నవంబరులో పెళ్లి చేసుకున్నాడు. ఈ మే నెలలో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు రాబోయే బేబీ కోసం షాపింగ్ చేయడం లాంటివి చూస్తుంటే మరో నెలరోజుల్లో గుడ్ న్యూస్ చెబుతారేమో అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)
