లతాజీ గొంతు బావుండదు.. | Twitter User Said Lata Mangeshkar Does not Have Good Voice | Sakshi
Sakshi News home page

లతాజీ గొంతు బావుండదు..

Jan 17 2021 10:19 AM | Updated on Jan 17 2021 10:19 AM

Twitter User Said Lata Mangeshkar Does not Have Good Voice - Sakshi

‘బందర్‌ క్యా జానే అద్రక్‌ కా స్వాద్‌’ అంటూ ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు అద్నామ్‌ సమీ ట్వీట్‌ చేశారు. ఈ వాక్యానికి ఇంచుమించు ‘గాడిదకేం తెలుసు గంధపు వాసన’ అనే అర్థం వస్తుంది. ఇంతకూ కారణం కావేరీ అనే అమ్మాయి లతాజీ మీద చేసిన ట్వీట్‌. ‘‘ఆమె ఉమ్రావ్‌జాన్‌ సినిమాలో పాడనందుకు చాలా సంతోషంగా ఉంది. పాకీజా చిత్రం వరకు బాగానే పాడారు. అందుకే అప్పటి పాటల గురించి నేను పట్టించుకోలేదు. ఈ కామెంట్‌కు 6.8 వేల లైక్‌లు, 1.5 డిస్‌లైక్‌లు వచ్చాయి. ఆమె చేసిన ట్వీట్‌కి సమాధానంగా చాలా ట్వీట్‌లు వచ్చాయి. సోషల్‌ మీడియాలో ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్లు పెట్టడం, విమర్శించటం ఒక అలవాటుగా మారిపోయింది. ఇటీవల డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను శాశ్వతంగా మూసివేసిన సంగతి తెలిసిందే.

‘లతా ఒంటి చేత్తో చాలామంది సింగర్‌ల కెరీర్‌ను నాశనం చేశారు. అందులో అనురాధా పొడ్వాల్‌ కూడా ఉన్నారు’ అంటూ మరొకరు స్పందించారు. ‘లతా మంగేష్కర్‌ గొంతు అద్భుతంగా ఉందంటూ భారతీయులకు బ్రెయిన్‌ వాష్‌ చేసేశారు’ అంటూ కావేరి మరో ట్వీట్‌ చేశారు. కొందరు ఆమె ట్వీట్‌కు అనుకూలంగా స్పందిస్తే, మరి కొందరు ఆమె ట్వీట్‌ను నిరసించారు. ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు అద్నాన్‌ సమీ, బాలీవుడ్‌ రచయిత వివేక్‌ అగ్నిహోత్రి మాత్రం కావేరీ మాటలను తోసి పుచ్చుతూ ఆమెను కోతిని చేశారు. ఈ అపవాదాలను తెలుగు పరిశ్రమలో ఘంటసాల, పి.సుశీల, బాలు కూడా తప్పించుకోలేకపోయారు. (చదవండి: సోనుసూద్‌ టైలర్‌ షాప్‌.. ప్యాంట్‌ కాస్త నిక్కర్‌ కావొచ్చు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement