Tunisha Sharma Ex Boyfriend Taking Her To Hospital After Suicide, CCTV Footage Video Viral - Sakshi
Sakshi News home page

Tunisha Sharma Last Video:నటి ఆత్మహత్య.. కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజ్‌

Dec 28 2022 7:01 PM | Updated on Dec 28 2022 7:46 PM

Tunisha Sharma Ex Boyfriend Taking Her To Hospital, CCTV Footage Viral - Sakshi

చావుబతుకుల్లో ఉన్న తునీషాను ఆస్పత్రికి తీసుకెళ్లిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. షీజన్‌ ఖాన్‌ సహా మరో ఇద్దరు తునీషాను ఆస్పత్రికి తీసుకొచ్చారు. 

నటి తునీషా శర్మ ఆత్మహత్య బుల్లితెర ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె ఇరవై ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడంపై సెలబ్రిటీలు, అభిమానలు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రియుడు, నటుడు షీజాన్‌ ఖాన్‌ బ్రేకప్‌ చెప్పడంతో కుమిలిపోయిన ఆమె ఆ బాధ తట్టుకోలేక ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో షీజాన్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అయితే షీజాన్‌ ఖాన్‌ విచారణలో గంటకో మాట చెప్తున్నాడు. కొద్ది రోజుల క్రితం కూడా తునీషా ఆత్మహత్యకు ప్రయత్నించగా అతడే ఆమెను కాపాడట. ఈ విషయం ఆమె తల్లికి చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడట. అటు నటి కుటుంబం మాత్రం తునీషా ఎటువంటి ఆత్మహత్యకు ప్రయత్నించలేదని చెప్తోంది. మరోపక్క అప్పటిదాకా చుక్క నీరు కార్చని షీజన్‌..  తునీషా అంత్యక్రియలు జరిగాయన్న విషయం తెలియగానే బోరుమని ఏడ్చాడట.

ఇదిలా ఉంటే చావుబతుకుల్లో ఉన్న తునీషాను ఆస్పత్రికి తీసుకెళ్లిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. షీజన్‌ ఖాన్‌ సహా మరో ఇద్దరు తునీషాను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఓ వ్యక్తి ఆమెను చేతుల మీదుగా ఎత్తుకుని వెళ్తుంటే షీజాన్‌ అతడికి సాయంగా ఉన్నాడు. ఈ విషయంపై డాక్టర్‌ సురేంద్రపాల్‌ మాట్లాడుతూ.. 'షూటింగ్‌ సెట్‌లో ఉన్నవారే తునీషాను ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది' అని చెప్పారు.

చదవండి: ఫ్యామిలీ జోలికొస్తే తరిమి తరిమి కొడతా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement