పెళ్లి వార్తలు.. తాప్సీ ఫస్ట్‌ పోస్ట్‌ చూశారా? | Taapsee Pannu First Post Amid Her Secret Wedding Rumours | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: ఇది కలకాలం ఉండాలంటూ తాప్సీ పోస్ట్‌.. పెళ్లి గురించేనా?

Mar 29 2024 1:21 PM | Updated on Mar 29 2024 3:36 PM

Taapsee Pannu First Post Amid Her Secret Wedding Rumours - Sakshi

ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్‌ కలర్‌ కోట్‌ వేసుకుని దిగిన ఫోటోలు షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు నిజంగా చీర గురించే మాట్లాడుతున్నావా? లేదా మథియస్‌తో నీ

సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు అన్ని విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. మరికొందరు తమ పర్సనల్‌ విషయాలను గోప్యంగా ఉంచుకోవడానికే ఇష్టపడతారు. అలా ఈ మధ్య హీరో సిద్దార్థ్‌ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకోగా హీరోయిన్‌ తాప్సీ పన్ను అయితే ఏకంగా పెళ్లే చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బోను పెళ్లాడిందని బాలీవుడ్‌ సమాచారం.

మార్చి 23న వివాహం?
మార్చి 23న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వివాహ వార్తల నేపథ్యంలో తాప్సీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. సారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్‌ కలర్‌ కోట్‌ వేసుకుని దిగిన ఫోటోలు షేర్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు నిజంగా చీర గురించే మాట్లాడుతున్నావా? లేదా మథియస్‌తో నీ బంధం శాశ్వతంగా నిలిచిపోవాలని పరోక్షంగా చెప్తున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. 

కెరీర్‌..
తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయిపోయింది. అక్కడ స్టార్‌ హీరోలతో నటిస్తూనే హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసి క్రేజ్‌ దక్కించుకుంది. 

చదవండి: కియారా భర్తను రాశీ పెళ్లి చేసుకుంటే బాగుండేది.. హీరోయిన్‌ ఏమందంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement