
అల్లు అర్జున్ పక్కా ఊరమాస్ గెటప్‌లో నటించిన చిత్రం ‘పుష్ప-ది రైజ్’. ఆర్య, ఆర్య 2 లాంటి హిట్ మూవీల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ని అందుకుంది. బన్నీ ఊర మాస్ యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ మూవీలో క్లైమాక్స్ సీన్‌పై మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. క్లైమాక్స్‌లో విలన్ ఫహద్ ఫాజిల్, అల్లు అర్లున్ అర్థనగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే. ఇద్దరు కూడా అండర్ వేర్ లో కనిపించే చాలా పోటాపోటీగా డైలాగ్స్ చెప్పారు. కానీ ప్రేక్షకులను ఆ సీన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
(చదవండి: సమంత నన్ను కాపీ కొట్టిందనడం దుర్మార్గం: బ్రహ్మానందం)
తాజాగా ఈ క్లైమాక్స్ సీన్‌పై దర్శకుడు సుకుమార్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘పుష్ప క్లైమాక్స్‌లో బన్నీ, ఫహాద్ ఇద్దరూ ప్యాంట్ షర్ట్ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు. నిజానికి ఆ సీన్‌లో ఇద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నా. కానీ, తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను అంగీకరించరని తెలిసి అప్పటికప్పుడు మార్పులు చేశాం’అని సుకుమార్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు పార్ట్ 2లో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. మొదటి భాగంతో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశామని, అసలు కథ సెకండ్ పార్ట్‌లో ఉంటుందన్నాడు. మరి ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో చూడాలి.