సుడిగాలి సుధీర్ 'గాలోడు'.. మరో లిరికల్ సాంగ్ రిలీజ్ | Sudigali Sudheer Galodu Movie Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Galodu Lyrical Song: సుడిగాలి సుధీర్ 'గాలోడు'.. మరో లిరికల్ సాంగ్ రిలీజ్

Published Wed, Oct 26 2022 9:38 PM | Last Updated on Wed, Oct 26 2022 9:38 PM

Sudigali Sudheer Galodu Movie Lyrical Song Out Now  - Sakshi

సుడిగాలి సుధీర్‍, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `గాలోడు`. ప‌క్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన `గాలోడు` టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. వైఫై నడకలదానా అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేసింది.

ఈ పాట‌లో సుధీర్ డ్యాన్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఈ సాంగ్‌లో హీరో లుక్ అదిపోయింది. 'ఓ పిల్లో హోయిలా హోయిలా' అంటూ సాగే పాట యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో అలపించగా..  శ్రీ శ్రీరాగ్ లిరిక్స్ సమకూర్చారు. యాక్షన్ అండ్‌ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్‌ కెరీర్‌లో హైలెట్‌గా నిలవనుంది. ఈ సినిమా విడుద‌ల తేదిని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించనున్నట్లు మేకర్స్ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement