ఆ రోజే హరోం హర | Sakshi
Sakshi News home page

ఆ రోజే హరోం హర

Published Sun, Apr 28 2024 5:35 AM

Sudheer Babu Harom Hara Releasing On May 31st

సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి మే 31న. కృష్ణ అల్లుడు, హీరో సుధీర్‌బాబు నటించిన ‘హరోం హర’ చిత్రం ఆ రోజే ధియేటర్లలోకి రానుంది. 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ ఫిల్మ్‌గా ‘హరోం హర’ రూపొందింది. ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం శనివారం ప్రకటించింది.

జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుమంత్‌ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ కథానాయికగా నటించగా, సునీల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘‘ఈ సినిమా కోసం సుధీర్‌ బాగా మేకోవర్‌ అయ్యారు. కథానుసారం కుప్పం స్లాంగ్‌లో డైలాగులు చె΄్పారు. ఈ వేసవి సెలవుల్లో మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement