రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ 'గే'నే: నటుడు | Sakshi
Sakshi News home page

Stranger Things Actor: 18 ఏళ్లుగా చెప్పలేకపోయా, ఇప్పుడు చెప్తున్నా నేను గే!

Published Fri, Jan 6 2023 4:00 PM

Stranger Things Noah Schnapp Release Video And Announced He Was Gay - Sakshi

నటుడు నోవా షన్నాప్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన స్ట్రేంజర్‌ థింగ్స్‌లో విల్‌ బయర్స్‌ అనే గే పాత్రలో నటించాడు. తీరా ఇప్పుడు తాను నిజంగానే స్వలింగ సంపర్కుడినని ప్రకటించాడు. 'పద్దెనిమిదేళ్లపాటు భయపడుతూ బతికిన నేను ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకున్నాను. నేను గే అని నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కు చెప్పేశాను. కానీ వాళ్లెంతో సులువుగా ఆ విషయం మాకు తెలుసని అనేశారు' అంటూ ఓ టిక్‌టాక్‌ వీడియో చేశాడు.

అక్కడితో ఆగకుండా 'నేను రియల్‌లైఫ్‌లో కూడా విల్‌ బయర్స్‌నే' అంటూ తాను స్వలింగ సంపర్కుడినని నొక్కి చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆ సిరీస్‌ చేసినప్పుడే మేము గెస్‌ చేయాల్సింది అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: తల్లితో కలిసి వంట చేస్తున్న అల్లు అయాన్‌
నరేశ్‌ పెళ్లి జరగనివ్వను: రమ్య

Advertisement
 
Advertisement
 
Advertisement