Sarath Babu: శరత్‌ బాబు రెండో భార్యగా నా ఫోటోలు.. చాలా బాధేసింది!!

Sneha Nambiar Gives Clarity On Second Marriage with Sarath Babu - Sakshi

స్నేహ నంబియార్  మలయాళీ అయినప్పటికీ.. ఆమె పుట్టి పెరిగింది బెంగళూరులోనే. స్నేహా ఎక్కువగా కన్నడ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. మలయాళ కుటుంబం నుంచి వచ్చిన స్నేహ బెంగళూరులో పుట్టి పెరిగడంతో  కన్నడ భాష సులభంగానే నేర్చుకుంది. అంతే కాకుండా ఆమెకు తమిళ భాషపై కూడా పట్టుంది. దక్షిణాది భాషలపై ఆమెకున్న ప్రావీణ్యం కారణంగా తమిళం, మలయాళం, కన్నడ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. అలా స్నేహ తమిళ ఇండస్ట్రీకి వెళ్లినప్పుడు ఆమెపై అప్పట్లో కొన్ని వార్తలు వ్యాపించాయి. ప్రముఖ నటుడు శరత్‌బాబును స్నేహ రెండో పెళ్లి చేసుకుందన్న వార్త అప్పట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు కొంతకాలానికి వీరు విడాకులు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి: సినిమా అగ్రిమెంట్‌ సంతకం పెట్టాక కాస్టింగ్‌ కౌచ్‌కు తెరలేపేవారు)

నా ఫోటోలు ప్రచారం చేశారు
అయితే శరత్‌ బాబు రెండో భార్యగా స్నేహ నంబియార్‌ ఫోటోలకు బదులుగా తన ఫోటోలు ప్రచురించారని వాపోయింది మరో నటి స్నేహ.  ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెపై వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. 'నా పేరుతో సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. శరత్ బాబు రెండో భార్యగా నా ఫొటో పెట్టారు. శరత్ బాబు రెండో భార్య స్నేహ నంబియార్ అని.. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారంటూ నా ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

అప్పుడు కూడా వదల్లేదు
ఆ వార్తలు నాకు చాలా ఇబ్బంది కలిగించాయి. ఆయన చనిపోయినప్పుడు కూడా శరత్‌ బాబు రెండో భార్యను నేనే అని ప్రచారం చేశారు. కానీ నేను ఆయన భార్యను కాదు. అసలైన స్నేహ నంబియార్‌ నాకంటే పెద్దది. తను ప్రముఖ నటుడు నంబియార్‌ కూతురు. మా ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ప్రతిసారి నా ఫోటోలు పెట్టేవారు. నిజానికి నా పేరు కేవలం స్నేహ మాత్రమే! అయితే స్నేహ అనే పేరుతో చాలామంది నటీమణులు ఉన్నందున నా పేరు పక్కన మా నాన్న పేరును చేర్చారు.

స్నేహ పేరు పక్కన నంబియార్‌ చేర్చడానికి కారణం..
పైగా నంబియార్ అనేది కేరళలోని కన్నూరులో ఓ చిన్న వర్గం. అందుకే తన పేరు తర్వాత మా వర్గమైన నంబియార్‌ను జత చేశారు. అలా నన్ను స్నేహ నంబియార్ అని పిలిచారు. అప్పట్లో అది కూడా పెద్ద వార్తే. ఎందుకంటే నేను ప్రముఖ తమిళ నటుడు ఎంఎన్ నంబియార్ కుమార్తె అని చెప్పుకుంటున్నాననీ విమర్శించారు. నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు. నంబియార్‌ కుమార్తెను కూడా కాదు' అని ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది నటి.

(ఇది చదవండి: పెళ్లిలో ఆలియా భట్‌ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్‌)

రమాప్రభతో పెళ్లి-విడాకులు
సీనియర్‌ నటి  రమాప్రభతో ఆయన ప్రేమాయణం అప్పట్లో ఇండస్ట్రీలో ఓ సంచలనం. శరత్ బాబు కంటే రమాప్రభ ఇండస్ట్రీలో సీనియర్‌ నటి. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇద్దరికి తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా వీళ్లు ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో కలిసి నటించారు కూడా.

14 ఏళ్ల తర్వాత విడాకులు
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. దాదాపు 14 ఏళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. అంతలా అన్యోన్యంగా కలిసున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ నటుడు నంబియార్ కుమార్తె స్నేహ నంబియార్‌ను రెండో పెళ్లి చేసుకోగా వీరి బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top