Simbu: రామ్ సినిమాలో బుల్లెట్ సాంగ్ పాడిన శింబు

ది వారియర్‌కు పాట పాడారు తమిళ హీరో, సింగర్ శింబు. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ది వారియర్. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది.
కాగా ఈ సినిమాలో బుల్లెట్ అంటూ సాగే పాటను శింబు పాడారు. శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. రామ్, దేవి శ్రీ ప్రసాద్‌లతో ఉన్న స్నేహం వల్లే శింబు మా చిత్రంలోని బుల్లెట్ పాట పాడారు. ఇది ఒక మాస్ నెంబర్. ఇటీవల ఇంట్రవెల్ సీన్‌తో పాటు హీరోహీరోయిన్లపై ఓ పాటను చిత్రీకరించాం. మా మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది అన్నారు. ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీప్రసాద్, కెమెరా : సుజీత్ వాసుదేవ్.
Thank you @SilambarasanTR_ #STRforRAPO #Thewarriorr pic.twitter.com/KUX2Fu62sa
— Lingusamy (@dirlingusamy) April 17, 2022
చదవండి: షారుక్, అజయ్‌లతో అక్షయ్ యాడ్, ఫైర్ అవుతున్న ఫ్యాన్స్