SIIMA Movie Awards 2022 Nominations List, Check Names Inside - Sakshi
Sakshi News home page

SIIMA Awards 2022:సైమా అవార్డు పోటీల్లో ‘పుష్ప’రాజ్‌ హవా.. బరిలో ఉన్న చిత్రాలివే

Published Wed, Aug 17 2022 4:11 PM

SIIMA Awards 2022 Nominations List - Sakshi

దక్షిణాది భాషల్లో రూపొందుతున్న సినిమాలకు ఒకే వేదికపై అవార్డులను అందిస్తున్న సంస్థ సైమా(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ మూవీ అవార్డ్స్‌). ఈ ఏడాది ఈ వేడుకను  సెప్టెంబర్‌ 10,11 తేదీలలో బెంగళూరులో జరపనున్నారు. ఈ నేపథ్యంలో సైమా వేదికగా తలపడనున్న సినిమాల జాబితాను విడుదల చేశారు. తెలుగు నుంచి పుష్ప, అఖండ, జాతిరత్నాలు,  ఉప్పెన చిత్రాలు ఎక్కువ విభాగాలలో నామినేట్‌ అయ్యాయి.

తెలుగు నుంచి పుష్ప అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్‌ అవ్వడం గమనార్హం. తమిళ్‌ నుంచి ‘కర్ణన్‌(10)’, కన్నడ నుంచి ‘రాబర్డ్‌’, మలయాళం నుంచి ‘మిన్నల్‌ మురళీ’ చిత్రాలు అత్యధిక నామినేషన్స్‌ పొందాయి. ఈ మొత్తం నామినేషన్స్‌ నుంచి విన్నర్‌ను ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా ఎంపిక చేసి అవార్డులు అందిస్తారు. ప్రేక్షకులు తమ అభిమాన నటీనటులు, సాంకేతిక నిపుణులకు సైమా వెబ్‌సైట్‌కు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. 

సైమా అవార్డులకు నామినేట్‌ అయిన చిత్రాలివే..

టాలీవుడ్‌
పుష్ప(అల్లు అర్జున్‌) : 12
అఖండ(బాలకృష్ణ): 10
జాతిరత్నాలు(నవీన్‌ పొలిశెట్టి): 8
ఉప్పెన(వైష్ణవ్‌ తేజ్‌):8

కోలీవుడ్‌
కర్ణన్‌(ధనుష్‌): 10
డాక్టర్‌(శివ కార్తికేయన్‌): 9
మాస్టర్‌(విజయ్‌): 7
తలైవి(కంగనా రనౌత్‌): 7

మాలీవుడ్‌
మిన్నల్‌ మురళీ(టోవినో థామస్‌): 10
కురుప్‌(దుల్కర్‌ సల్మాన్‌):8
మాలిక్‌(ఫహద్‌ పాజిల్‌):6
జోజీ(ఫహద్‌ ఫాజిల్‌):6
 

శాండల్‌వుడ్‌ 
రాబర్ట్‌(దర్శన్‌):10
గరుడ గమన వృషభ వాహన(రాజ్‌ బి.శెట్టి): 8
యువరత్న(పునీత్‌ రాజ్‌కుమార్‌): 7

Advertisement
 
Advertisement
 
Advertisement