శ్రీకృష్ణుడి యుద్ధం | Shri Krishna Avatar In Mahoba New Title Announced On Krishnastami | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణుడి యుద్ధం

Aug 16 2025 3:25 AM | Updated on Aug 16 2025 3:25 AM

Shri Krishna Avatar In Mahoba New Title Announced On Krishnastami

చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించనున్నట్లు ‘శ్రీ కృష్ణ అవతార్‌ ఇన్‌ మహోబా’ చిత్రబృందం ప్రకటించింది. ముకుంద్‌ పాండే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో అభయ్‌ చరణ్‌ ఫౌండేషన్‌–శ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ‘శ్రీ కృష్ణ అవతార్‌ ఇన్‌ మహోబా’ టైటిల్‌ను ప్రకటించారు. ‘‘ఇస్కాన్‌–ఢిల్లీకి చెందిన సీనియర్‌ ప్రీచర్‌ ‘జితామిత్ర ప్రభు శ్రీ’ ఆశీస్సులతో ఈ చిత్రం రూపొందుతోంది.

11–12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్‌ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించేలా ఈ సినిమా ఉంటుంది. పాన్‌ వరల్డ్‌ ప్రాజెక్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మికతను కలగలుపుతుంది. నటీనటులు, సాంకేతిక బృందంతో పాటు పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: అనిల్‌ వ్యాస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement