యాక్షన్‌... ఎమోషన్‌ | Sharwanand Biker First Lap Glimpse to play with Baahubali | Sakshi
Sakshi News home page

యాక్షన్‌... ఎమోషన్‌

Oct 31 2025 4:59 AM | Updated on Oct 31 2025 4:59 AM

Sharwanand Biker First Lap Glimpse to play with Baahubali

శర్వానంద్, మాళవికా నాయర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బైకర్‌’. అభిలాష్‌ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, అతుల్‌ కులకర్ణి కీలక పాత్రలు  పోషిస్తున్నారు. విక్రమ్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ–ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కాగా ‘బైకర్‌’ ఫస్ట్‌ ల్యాప్‌ గ్లింప్స్‌ని నేటి నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నారు.

‘బాహుబలి: ది ఎపిక్, మాస్‌ జాతర’ సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో ఈ గ్లింప్స్‌ చూపించబోతున్నారు.   ఈ విషయాన్ని పేర్కొని, శర్వానంద్‌ కొత్త  పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ‘‘బైకర్‌’లో మోటార్‌ సైకిల్‌ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారు శర్వానంద్‌. 1990, 2000 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా రేసింగ్‌ యాక్షన్‌తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్‌ డ్రామాగా రూపొందుతోంది. మూడు తరాల రేసింగ్‌ కథతో, కుటుంబ బంధాలతో సాగే కథ ఇది. ఈ మూవీ గ్లింప్స్‌ని డిజిటల్‌గా నవంబరు 1న రిలీజ్‌ చేస్తాం’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ సినిమాకి కెమెరా: జె. యువ రాజ్, సంగీతం: జిబ్రాన్,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement