దిల్ రాజు చేతుల మీదుగా 'ష‌ర‌తులు వ‌ర్తిసాయి' టీజర్ రిలీజ్ | Sharathulu Varthisthai Movie Teaser | Sakshi
Sakshi News home page

దిల్ రాజు చేతుల మీదుగా 'ష‌ర‌తులు వ‌ర్తిసాయి' టీజర్ రిలీజ్

Published Sat, Feb 3 2024 8:54 PM | Last Updated on Sat, Feb 3 2024 9:09 PM

Sharathulu Varthisthai Movie Teaser - Sakshi

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం 'ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి'. కుమార‌స్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు టీజర్ విడుదల చేశారు. 

(ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు)

'బలగం' కంటే ఎక్కువగా తెలంగాణ నేటివ్‌తో సినిమా తీశారు. ఇదో మంచి మూవీ అవుతుందని ఆశిస్తున్నా. చిత్రబృందానికి అందరికీ ఆల్ ది బెస్ట్ అని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఒక సున్నితమైన కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ చేర్చుతూ అందరికీ నచ్చేలా సినిమా తీశారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత కుమారస్వామి మరిన్ని మంచి మూవీస్ చేస్తాడు. త్వరలోనే 'ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి' థియేటర్లలోకి వస్తుంది. మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నానని హీరో చైతన్య రావు చెప్పారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్ సమాధానమిదే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement