‘పలాస 1978’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన హీరో రక్షిత్ అట్లూరి నటిస్తున్న తాజా చిత్రం 'శశివదనే'... ఇందులో కోమలీ ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తుంది. రీసెంట్‌గా హిట్-3 సినిమాతో ఆమె మరింత గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'శశివదనే' చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు నటిస్తున్నారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌తో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది గోదావరి నేపథ్యంలో సాగే ఫీల్‌గుడ్ వింటేజ్ విలేజ్ లవ్‌స్టోరీ. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.


