రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో...

Sandeep Madhav of George Reddy fame signs a romantic entertainer - Sakshi

‘వంగవీటి, జార్జి రెడ్డి’ వంటి సినిమాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సందీప్‌ మాధవ్‌. తాజాగా ఆయన నటించనున్న సినిమాని ప్రకటించారు. ఈ చిత్రంతో రచయిత జె.వి. మధుకిరణ్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. హల్సియన్‌ మూవీ పతాకంపై సినిమాటోగ్రాఫర్‌ అరుణ్‌ కుమార్‌ సూరపనేని ఈ సినిమా నిర్మించనున్నారు. ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.

‘వంగవీటి, జార్జి రెడ్డి’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన సందీప్‌ మాధవ్‌ ఈ సినిమాతో మరింత దగ్గరవుతారు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని రూపొందించనున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కాగా.. ‘వంగవీటి’, ‘జార్జి రెడ్డి’.. ఈ రెండూ యాక్షన్‌ సినిమాలే. తాజా సినిమా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ కాబట్టి కొత్త లుక్‌లో సందీప్‌ కనిపిస్తారని ఊహించ్చు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top