
సలార్ సినిమా రిలీజ్‌పై వస్తున్న పుకార్లను నమ్మవద్దు. షూటింగ్ ఆలస్యంగా జరుగుతుందని రిలీజ్ వాయిదా పడుతుందంటూ రూమర్స్ వస్తున్నాయి. అందులో ఎటువంటి నిజం లే
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న చిత్రం సలార్. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఈ చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడనుందంటూ నెట్టింట పుకార్లు మొదలయ్యాయి. తాజాగా ఈ రూమర్స్‌పై చిత్రయూనిట్‌పై స్పందించింది.
సలార్ సినిమా రిలీజ్‌పై వస్తున్న పుకార్లను నమ్మవద్దు. షూటింగ్ ఆలస్యంగా జరుగుతుందని రిలీజ్ వాయిదా పడుతుందంటూ రూమర్స్ వస్తున్నాయి. అందులో ఎటువంటి నిజం లేదు. మా మీద విశ్వాసం ఉంచండి. రిలీజ్ డేట్‌లో ఎటువంటి మార్పు ఉండదు. అనుకున్న తేదీకి వస్తాం. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న సినిమా విడుదలవుతుంది అని క్లారిటీ ఇచ్చింది.