సూర్య అభిమానులు ఫుల్‌ ఖుషీ...ఎందుకో తెలుసా? | RJ Balaji dismisses Suriya Karuppu Film Delay Rumours | Sakshi
Sakshi News home page

సూర్య అభిమానులు ఫుల్‌ ఖుషీ...ఎందుకో తెలుసా?

May 10 2026 9:19 AM | Updated on May 10 2026 11:24 AM

RJ Balaji dismisses Suriya Karuppu Film Delay Rumours

వైవిధ్య భరత పాత్రల్లో నటించాలని తపించే అతికొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. ఈయన ఏ చిత్రం చేసిన తన పాత్రలో కచ్చితంగా కొత్త దనాన్ని చూపిస్తుంటారు. అలా నటించిన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొంది ఉండకపోవచ్చు. అయితే సూర్య నటన మాత్రం అందరూ కొనియాడతారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కరుప్పు. నటి త్రిష నటించిన ఈ చిత్రాన్ని నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మించింది. 

ఈ చిత్రంలో సూర్య విభిన్న గెటప్పులతో కనిపించడంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చిత్ర ఆడియో విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. కాగా త్వరలోనే చిత్ర ట్రైలర్‌ విడుదల కానుంది. ఇక ఆయన అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్న కరుప్పు చిత్రం ఈనెల 14వ తేదీన తెరపైకి రానుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం విడుదల అవుతుందా అన్న సందేహం వ్యక్తం అవుతున్న తరుణంలో నిర్ణయించిన తేదీలోనే చిత్రం విడుదలవుతుందని దర్శకుడు ఆర్జే బాలాజీ స్పష్టంగా పేర్కొన్నారు. 

ఇకపోతే సూర్య కథానాయకుడిగా నటించిన మరో చిత్రం విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌. నటి మమితా బైజు నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ సక్సెస్‌ ఫుల్‌ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. కాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు ప్రకటించడంతో సూర్య అభిమానులకు డబల్‌ ధమాకా కావడంతో యమ ఖుషీ అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement