Rana Daggubati Takes Break From Social Media - Sakshi
Sakshi News home page

Rana Daggubati: ఒక్క ట్వీట్‌తో ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రానా.. కొన్నాళ్లు బ్రేక్‌! 

Aug 6 2022 7:38 AM | Updated on Aug 6 2022 9:28 AM

Rana Daggubati Takes Break From Social Media - Sakshi

బిగ్గర్‌.. బెటర్‌.. స్ట్రాంగర్‌

ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి కొన్నాళ్ల పాటు సామాజిక మాధ్యమానికి(సోషల్‌ మీడియా) బ్రేక్‌ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని రానా శుక్రవారం సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. ‘‘పని జరుగుతోంది. సోషల్‌ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. సినిమాలతో కలుద్దాం. బిగ్గర్‌.. బెటర్‌.. స్ట్రాంగర్‌’ అంటూ ట్వీట్‌ చేసి అభిమానులకు షాకిచ్చాడు.

(చదవండి: ఆ బాధకు కారణం తెలియదు..ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: దీపికా పదుకోన్‌)

ఇటీవల ‘విరాటపర్వం’తో ప్రేక్షకులను పలకరించాడు రానా. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కామ్రేడ్‌ రవన్నగా రానా కనిపించాడు. ఈ చిత్రం తర్వాత రానా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. అయితే ఇప్పటికే రానా దర్శకుడు గుణశేఖర్‌తో ‘హిరణ్య కశ్యప’, దర్శకుడు మిలింద్‌ రావుతో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలి సిందే.  అలాగే ‘కోడిరామ్మూర్తి’ బయోపిక్, తేజ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక వెంకటేశ్, రానా కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ త్వరలో నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.  

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement