Ram Gopal Varma First Love: RGV Shares His First Lover Pic - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఫస్ట్‌లవర్‌ ఫొటో షేర్‌ చేసిన ఆర్జీవీ

Aug 25 2021 3:35 PM | Updated on Aug 26 2021 5:29 PM

Ram Gopal Varma Shares His First Lover Photo - Sakshi

తరచూ వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఈ సారి కొత్తగా వైరల్‌ అవుతున్నాడు. తాజాగా తన ఫస్ట్‌ లవర్‌ను పరిచయం చేస్తూ ఆమె ఫొటో షేర్‌ చేశాడు. అయితే కమిట్‌మెంట్‌ లేని బంధాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆర్జీవీ ఇలా తన తొలిప్రేమను పరిచయం చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అతిలోకసుందరి, దివంగత నటి శ్రీదేవి తన క్రష్‌ అని చెప్పుకొచ్చిన వర్మ కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆమె పేరు పోలవరపు సత్య అని, ఆమె మెడిసిన్‌ చేసినట్లు తెలిపాడు.
(చదవండి: మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్‌ హీరో తెలుసా!)

కాగా విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ ఆర్జీవీ బిటెక్‌ చదివిన విషయం తెలిసిందే. అదే క్యాంపస్‌లో సిద్దార్థ మెడికల్‌ కాలేజీలో సత్య మెడిసిన్‌ చేసిందని చెప్పాడు. అవి రెండు క్యాంపస్‌లు ఒకేచోట ఉండటంతో రోజు సత్యను చూసేవాడినని, అలా తనతో ప్రేమలో పడిపోయినట్లు చెప్పాడు. కానీ ఆమె డబ్బు ఉన్న మరో వ్యక్తితో ప్రేమలో ఉన్న కారణంగా తనని పట్టించుకునేది కాదనే భావనలో ఉండేవాడినన్నాడు. అలా ‘రంగీలా’ మూవీ స్టోరీ పుట్టిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అయితే ప్రస్తుతం సత్య అమెరికాలో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తున్నట్లు వర్మ చెప్పాడు. అంతేగాక బీజ్‌ తీరాన స్విమ్‌సూట్‌లో ఉన్న ఆమె ఫొటోలను తన వరుస ట్వీట్‌లలో షేర్‌ చేశాడు. 

చదవండి: ఆ వీడియోలోని వ్యక్తి నేను కాదు.. జో బైడెన్‌ మీద ఒట్టు!: వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement