ఆ పాత్ర చేయడానికి భయపడ్డా! | Sakshi
Sakshi News home page

ఆ పాత్ర చేయడానికి భయపడ్డా!

Published Sat, Jul 16 2022 1:00 AM

Raashi Khanna Talks About Rudra Webseries - Sakshi

‘‘ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేసినప్పుడే ఏ ఆర్టిస్ట్‌కైనా సంతృప్తి లభిస్తుంది. అందుకే ‘రుద్ర’ వెబ్‌ సిరీస్‌లో నాది కాస్త నెగటివ్‌ షేడ్‌ క్యారెక్టర్‌ అయినప్పటికీ చేశాను’’ అన్నారు రాశీ ఖన్నా. అయితే ఈ క్యారెక్టర్‌ ఒప్పుకునే ముందు ఈ బ్యూటీ భయపడ్డారట. ఈ విషయం గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘సినిమాల్లో నన్ను పాజిటివ్‌ రోల్స్‌లో చూసిన ఫ్యాన్స్‌ నెగటివ్‌ షేడ్స్‌లో చూసి ఫీలవుతారేమోనని కాస్త భయపడ్డాను. నా మీద ఎంతో అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్‌కి నేను ఆన్సరబుల్‌.

సౌత్‌లో నాకు పాజిటివ్‌ ఇమేజ్‌ ఉంది కాబట్టి ఇక్కడివారు ఎలా రియాక్ట్‌ అవుతారో అని కొంచెం డౌట్‌ ఉండేది. కానీ ఆర్టిస్ట్‌గా చాలెంజింగ్‌ రోల్స్‌ చేయాలి కాబట్టి నా కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికొచ్చి ‘రుద్ర’ చేశాను. నా క్యారెక్టర్‌ చాలామందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. నచ్చక పోవడానికి కారణం నా మీద వారికున్న పాజిటివ్‌ ఇమేజ్‌. ఏది ఏమైనా నాకు ఫ్యాన్స్‌ సపోర్ట్‌ ఎప్పుడూ కావాలి. ఎందుకంటే ఒక యాక్టర్‌గా నేను డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడు వాళ్లు చూస్తేనే నేను మళ్లీ మళ్లీ అలాంటివి చేయగలుగుతాను. లేకపోతే ఒకే తరహా రోల్స్‌కి పరిమితం కావాల్సి వస్తుంది’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement