Pushpa Part 2 Title: Pushpa Movie Second Part Title Leaked - Sakshi
Sakshi News home page

Pushpa Movie: 'పుష్ప' సినిమా రెండో భాగం టైటిల్‌ రివీల్‌ !

Dec 17 2021 8:47 AM | Updated on Dec 20 2021 11:33 AM

Pushpa Movie Second Part Title Leaked - Sakshi

Pushpa Movie Second Part Title Leaked: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తొలిసారిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష‍్ప: ది రైజ్‌'. ఆర్య, ఆర్య-2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం పుష్ప. డిసెంబర్‌ 17న విడుదలకానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత‍్రంలో హీరో, కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు పుష్పరాజ్‌కు విలన్లుగా నటించడం విశేషం. అయితే పుష్ప మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. 

ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ని 'పుష్ప: ది రైజ్‌' పేరుతో విదలైంది. వచ్చే ఏడాది రెండో భాగం రానుంది. అయితే సెకండ్ పార్ట్‌కు ఏ పేరు పెడతారో అని బన్నీ అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు పుష్ప సెకండ్‌ పార్ట్‌ సినిమా పేరును రివీల్‌ చేశాడు దర్శకుడు సుకుమార్‌. రెండో భాగం పేరును "పుష‍్ప: ది రైజ్' సినిమా చివర్లో చెప్పేశాడు. ఈ సెకండ్‌ పార్ట్‌కు 'పుష్ప: ది రూల్‌' అని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ టైటిల్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పుష్ప ది రైజ్‌తోనే మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగిస‍్తున్న బన్నీ సెకండ్‌ పార్టులో తన రూలింగ్‌తో మరింత డోస్‌ పెంచనున్నట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement