
‘ప్రాజెక్ట్ కె’ మిషన్‌ను మళ్లీ ఆన్ చేశారు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్). దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
ప్రభాస్ ఈ షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రభాస్, ఓ బాలీవుడ్ యాక్టర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం వేసిన మూడు ప్రధాన సెట్స్‌లో ప్రస్తుతం టాకీ పార్ట్ షూటింగ్ జరుగుతోంది.
ఈ నెల 10 వరకు ఈ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి తోట రమణి ఓ ఆర్ట్ డైరెక్టర్. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.