‘ఉపేంద్ర గాడి అడ్డా’ ప్రేక్షకులను సమ్మోహనపరుస్తుంది: నిర్మాత | Producer Kancharla Achutha Rao Talks About Upendra Gaadi Adda Movie | Sakshi
Sakshi News home page

‘ఉపేంద్ర గాడి అడ్డా’ ప్రేక్షకులను సమ్మోహనపరుస్తుంది: నిర్మాత

Oct 28 2023 5:06 PM | Updated on Oct 28 2023 5:12 PM

Producer Kancharla Achutha Rao Talk About Upendra Gaadi Adda Movie  - Sakshi

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌కే దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై  కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని  ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలే విడుదల చేసి, చిత్రం విజయవంతం కావాలని చిత్ర యూనిట్ కు శుభాభినందనలు  అందజేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ,  "మొదట్నుంచి నాకు సినిమా పిచ్చి ఉండేది. విడుదలైన అన్ని సినిమాలు చూస్తూండేవాడ్ని. అయితే నేను ఇతర వ్యాపార రంగాలలో బిజీ కావడంతో ఇంతకాలం సినిమా రంగంలోనికి ప్రవేశించలేదు. అయితే సినీ హీరో కావాలన్న మా అబ్బాయి ఉపేంద్ర తృష్ణను గమనించి, అతనిని హీరోగా పరిచయం చేస్తూ, ఐదు సినిమాలను మొదలు పెట్టాం. అవన్నీ వివిధ దశలలో ఉన్నాయి. ఐదవ సినిమాగా మొదలు పెట్టిన ఈ సినిమా చాలా వేగంగా పూర్తయి, మొదటి సినిమాగా విడుదలకు సిద్ధమైంది. పూర్తి వినోదం, మాస్ అంశాలతో ఆద్యంతం ప్రేక్షకులను సమ్మోహనపరిచేవిధంగా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ చిత్రం రూపొందింది

ఈ నెల 29న మా అబ్బాయి పుట్టినరోజున ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నాం. అదేరోజున ఈ చిత్రం ట్రైలర్ ను కూడా విడుదల చేస్తాం. నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేయడంతో పాటు మిగతా మేము తీస్తున్న సినిమాలను ప్రతీ నెలా ఒక సినిమా చొప్పున విడుదల చేస్తాం’ అని చెప్పారు.

‘సోషల్ మీడియా  నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియంది కాదు. దానివల్ల చెడు మార్గాన్ని ఎంచుకోకుండా, మంచిని పెంపొందింపజేస్తే, సమాజం మరింత వికాసవంతం అవుతుందన్న సందేశాత్మక పాయింట్ ను కూడా ఇందులో ఆవిష్కరించాం’అని దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో కంచర్ల ఉపేంద్ర, హీరోయిన్ సావిత్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement