విరాళాల వెల్లువ.. నిర్మాత ఐసరి గణేష్ కోటి విరాళం

చెన్నై: ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపు మేరకు పలువురు సినీ, రాజకీయ నాయకులు కరోనా నివారణ నిధికి విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. వేల్స్ విద్యాలయం కులపతి, సినీ నిర్మాత డాక్టర్ ఐసరి గణేష్ కరోనా నివారణ నిధికి రూ.కోటి ప్రకటించారు. ఆయన సతీమణి ఆర్తి గణేష్, కుమార్తె ప్రీతా గణేష్‌తో కలిసి మంగళవారం సాయంత్రం సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు చెక్కు అందజేశారు.