Priyank Sharma: ఆస్పత్రికి వెళ్లిన నటుడిపై పిడిగుద్దులు కురిపించిన వ్యక్తి

హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రియాంక్ శర్మపై దాడి జరిగింది. జూలై 30న తన పేరెంట్స్‌తో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఆస్పత్రికి వెళ్లిన ప్రియాంక్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయగా అతడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ప్రియాంక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 'అమ్మ చెకప్ కోసం హాస్పిటల్ వెళ్లాం. అక్కడ ఓ వ్యక్తి సడన్‌గా నా ముందుకు వచ్చి నన్ను కొట్టడం ప్రారంభించాడు. అతడి చేయిని పట్టుకుని ఆపేందుకు ప్రయత్నించాను. కానీ అతడు మాత్రం ఎంతో శక్తి కూడదీసుకుని నాపై పిడిగుద్దులు కురిపించాడు. ఇంతలోనే ఆస్పత్రి సిబ్బంది పరిగెత్తుకుంటూ రావడంతో అతడు పారిపోయాడు. అప్పుడు నాకు చాలా భయమేసింది' అని నటుడు చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటనపై ప్రియాంక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆస్పత్రి యాజమాన్యం మాత్రం సీసీటీవీ ఫుటేజీ ఇవ్వడానికి నిరాకరించడం గమనార్హం.
ఈ దాడి జరిగిన మూడు రోజులకే ప్రియాంక్ శర్మ తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆగస్టు 2న తన బర్త్‌డేను పురస్కరించుకుని ఓ స్వచ్చంద సంస్థ చిన్నపిల్లలతో కేక్ కట్ చేయించిన వీడియోను షేర్ చేశాడు. ఇకపోతే ప్రియాంక్ శర్మ.. స్ప్లిట్స్ విల్లా, బిగ్‌బాస్ 11వ సీజన్‌లో పాల్గొన్నాడు. పంచ్ బీట్ రెండో సీజన్, మమ్ భాయ్ అనే వెబ్ సిరీస్‌లలోనూ నటించాడు. సంవత్సరాలపాటు ఒకే పాత్రలో నటించడం బోర్ అని అందుకే తాను సీరియల్స్ చేయలేదని, ఎప్పటికీ చేయబోనని అంటున్నాడు.
చదవండి: భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్, ప్రణీత ఏమందంటే?
సినిమా రిలీజ్ డేట్ మారడమనేది మిస్టరీ అయింది