పొన్నియన్‌ సెల్వన్‌ షూటింగ్‌లో ప్రకాశ్‌ రాజ్‌

Prakash Raj joins Ponniyin Selvan Sets With Mani Ratnam To Shoot - Sakshi

చెన్నై: పొన్నియన్‌ సెల్వన్‌ చిత్ర యూనిట్‌ గ్వాలియర్‌లో మకాం పెట్టింది. దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చారీత్రాత్మక చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌. లైకా ప్రొడక్షన్స్, మణిరత్నం మెడ్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, ప్రకాష్‌రాజ్, విక్రమ్‌ప్రభు తదితరులు నటిస్తున్నారు. ఇటీవల పుదుచ్చేరి, హైదరాబాద్‌లో పలు సన్నివేశాలను చిత్రీకరించారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కోసం దర్శకుడు మణిరత్నం, నటుడు కార్తీ, ప్రకాష్‌రాజ్‌ తదితరులు గ్వాలియర్‌ నగరానికి వెళ్లారు. అక్కడ మణిరత్నం, కార్తీలతో దిగిన ఫొటోలను నటుడు ప్రకాష్‌రాజ్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 

చదవండి : సెట్‌లో పూజా తీరుపై మండిపడ్డ ప్రముఖ డైరెక్టర్‌
Crazy Uncles: వివాదంలో శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top