
హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ చిత్రంలో ‘యానిమల్’ సినిమా ఫేమ్ త్రిప్తీ దిమ్రి హీరోయిన్‌గా నటించనున్నారు. ప్రభాస్‌పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న తొలి చిత్రం ఇది. డాక్టర్ పాత్రలో త్రిప్తి కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరు చివర్లో లేదా జనవరి ప్రారంభంలో మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయట. కాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన కొంత భాగాన్ని మెక్సికోలో జరపనున్నట్లు సందీప్ ఓ సందర్భంలో పేర్కొన్నారు.
మరి... తొలి షెడ్యూల్ షూటింగ్ మెక్సికోలోనే జరుగుతుందా? లేక హైదారాబాద్‌లోప్రారంభం అవుతుందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమా మేజర్ షూటింగ్ విదేశాల్లోనే జరుగుతుందట. ఈ చిత్రం సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోజ్ చేసిన కొన్ని ట్యూన్స్‌ను సందీప్ ఆల్రెడీ ఫైనలైజ్ చేశారని టాక్. భూషణ్‌కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించనున్న ఈ ‘స్పిరిట్’ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ‘ది రాజాసాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రా లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు.