ప్రభాస్ 'కల్కి' వాయిదా? ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసిన నిర్మాణ సంస్థ | Sakshi
Sakshi News home page

Prabhas Kalki Movie: ఒక్క పోస్టుతో వాయిదా‌పై క్లారిటీ ఆగయా

Published Fri, Feb 23 2024 9:49 PM

Prabhas Kalki Movie Postponed Rumors Vyjayanthi Movies Respond - Sakshi

ప్రభాస్ 'కల్కి' సినిమా వాయిదా.. గత కొన్నిరోజుల నుంచి అభిమానులు, సినీ ప్రేమికుల మధ్య ఇదే డిస్కషన్. చెప్పిన తేదీకి వచ్చే సమస్య లేదని కొందరు... కచ్చితంగా వస్తుందని మరికొందరు చెప్పుకొచ్చారు. దీంతో సగటు ప్రేక్షకుడు పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. సరిగ్గా ఇలాంటి టైంలో విడుదల తేదీ పుకార్లపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చేసింది.

'బాహుబలి' తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అలా చాలా ఏళ్ల క్రితమే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీ కమిట్ అయ్యాడు. కాకపోతే మిగతా చిత్రాల వల్ల ఇది లేట్ అవుతూ వచ్చింది. ఏడాదిన్నర క్రితం నుంచి మాత్రం గ్యాప్ ఇస్తూనే షూటింగ్ చేస్తూ వచ్చారు. కొన్నాళ్ల క్రితం టీజర్ లాంటి వీడియో ఒకటి రిలీజ్ చేసి హైప్ పెంచారు.

(ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?)

ఈ మధ్య కాలంలో అయితే 'కల్కి' చిత్రంలో నాని, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ.. ఇలా చాలామంది స్టార్ హీరోలు నటిస్తున్నారని, ఏకంగా 9 భాగాల ఫ్రాంచైజీగా దీన్ని తీయబోతున్నారని ఇలా ఇలా అంచనాలు పెంచే మాటలు చాలా వినిపించాయి. అదే టైంలో చాలారోజుల క్రితమే ప్రకటించినట్లు మే 9న ఈ సినిమా థియేటర్లలోకి రాకపోవచ్చనే టాక్ వినిపించింది.

అయితే ఇదంతా చూస్తూ వచ్చిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. ఎ‍ట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చెబుతూ.. ప్రభాస్ కాలు చూపిస్తున్న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో రూమర్స్‌కి చెక్ పడినట్లయింది. ఈ వేసవిలో వస్తున్న ఏకైక స్టార్ హీరో సినిమా ప్రభాస్  'కల్కి'నే కావడం విశేషం.

(ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్)

 
Advertisement
 
Advertisement