
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ చిత్రం ఐఎండీబీ ప్రకటించిన లిస్ట్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ ఏడాదిలో ఇండియావ్యాప్తంగా ఇప్పటివరకు మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాలో కల్కి మొదటిస్థానంలో నిలిచింది. దీంతో చిత్రయూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఈ జాబితాలో కల్కి తర్వాత మలయాళ బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, సైతాన్ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుసగా.. లపత్తా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్యా సినిమాలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో మలయాళ చిత్రాలు సత్తా చాటగా.. టాలీవుడ్ నుంచి కల్కి, హనుమాన్ మాత్రమే చోటు దక్కించుకున్నాయి. కాగా.. కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ నాలుగో స్థానం నిలిచి సత్తా చాటింది.
‘Tis the season of lists, and we’re back with the ultimate one! 🌟
Halfway through 2024, we're excited to share the Most Popular Indian Movies of the year (so far!) 🎬✨
Which one's your top pick? 🤔
1. Kalki 2898-AD pic.twitter.com/9eCnBR7zYM— IMDb India (@IMDb_in) July 23, 2024