Nikhil Siddharth '18 Pages' Movie OTT Release Date, Platform - Sakshi
Sakshi News home page

18 Pages OTT Streaming: ఓటీటీకి వచ్చేస్తున్న ‘18 పేజెస్‌’ మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Jan 14 2023 6:12 PM | Updated on Jan 14 2023 6:50 PM

OTT: Nikhil Siddharth 18 Pages Movie Streaming in Netflix Soon - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్ర 18 పేజెస్‌. గతేడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంది. మంచి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ చిత్రం మొత్తంగా రూ. 25 కోట్లపైనే గ్రాస్‌ కలెక్ట్‌ చేసి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

చదవండి: దుమ్ములేపుతున్న వాల్తేరు వీరయ్య.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయంటే!

వెండితెరపై సత్తా చాటిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ ఆహాకు దక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఓటీటీ దిగ్గజం ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్‌ 18 పేజెస్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకురాబోతున్నట్లు తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చింది. అయితే స్ట్రీమింగ్‌ డేట్‌ను మాత్రం వెల్లడించలేదు.

చదవండి: నేను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్నా! షాకిచ్చిన అనసూయ..

త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనుంది నెట్‌ఫ్లక్స్‌. కాగా కాగా బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాను, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి పాన్‌ ఇండియా డైరెక్టర్‌ సుకుమార్‌ కథ అంధించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో సిద్ధు, నందినిల పాత్రలను మలిచిన తీరు, పాటలు, కొన్ని అందమైన విజువల్స్, వీటన్నింటిని మించి సుకుమార్ మార్క్‌తో కూడిన క్లైమాక్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement