అఫీషియల్‌ : పవన్‌ సరసన నిత్యామీనన్‌..

Nithya Menen To Romance Pawan Kalyan: Ayyappanum Koshiyum Remake - Sakshi

పవన్‌కల్యాణ్‌ రానా ప్రధాన పాత్రల్లో 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌' రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తుండగా, సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో పవన్‌ సరసన నిత్యామీనన్ నటిస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిని నిజం చేస్తూ.. 'నిత్యామీనన్‌ అబోర్డ్‌' అంటూ  చిత్రబృందం పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో నిత్యామీనన్‌ చీరకట్టు, మంగళసూత్రంతో కనిపించడంతో ఆమె పవన్‌కు భార్యగా నటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. ఇక పవన్‌కల్యాణ్‌ ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా కనిపించనున్నారు. మరోవైపు రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్‌ నటించనుందని, త్వరలోనే ఆమె షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 12గా ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top