హైదరాబాద్‌లో మట్కా | New schedule begins for Varun Tej starrer Matka in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మట్కా

Published Fri, Jun 21 2024 3:36 AM | Last Updated on Fri, Jun 21 2024 3:36 AM

New schedule begins for Varun Tej starrer Matka in Hyderabad

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియన్‌ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డా. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ్రపారంభమైంది. ‘‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. దేశమంతటా సంచలనం సృష్టించిన ఓ నిజ జీవిత ఘటన స్ఫూర్తితో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఇందులో వినోదంతో పాటు నిజ జీవితంలోని ఘటనలు, హ్యూమన్‌ ఎమోషన్స్‌ చాలా అద్భుతంగా ఉంటాయి. ‘మట్కా’లో నాలుగు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు వరుణ్‌ తేజ్‌. నలభై రోజుల పాటు జరగనున్న ఈ ముఖ్యమైన షెడ్యూల్‌ కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేక సెట్‌ నిర్మించాం. ఇందులో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ప్రస్తుతం వరుణ్, నోరా, మీనాక్షీలపై సన్నివేశాలు తీస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. నవీన్‌ చంద్ర, అజయ్‌ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి. రవిశంకర్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: ఎ. కిశోర్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement