‘తంబీ..’ అంటూ ధనుష్‌కి ‘అవెంజర్స్‌’ డైరెక్టర్స్‌ విషెస్‌

Netflix Jagame Thandhiram Release Russo Brothers Wished Dhanush  - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌.. మిగతా భాషల్లోనూ టాలెంటెడ్‌ హీరోగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పరుచుకున్నాడు. వరుసగా ప్రయోగాత్మక సబ్జెక్టుల్లో యాక్ట్‌ చేస్తున్న ధనుష్‌.. లేటెస్ట్‌గా గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘జగమే తందిరమ్‌’(జగమే తంత్రం)తో సందడి చేయబోతున్నాడు. ఈ తరుణంలో హాలీవుడ్‌ దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్‌ ధనుష్‌కి గుడ్‌లక్‌ చెప్పారు. 

‘సూపర్‌ డా తంబీ.. నీతో పనిచేసేప్పుడు ఎగ్జైట్‌ అయ్యాం. కొత్త సినిమా రిలీజ్‌కు గుడ్‌ లక్‌’ అంటూ ట్రైలర్‌తో సహా ట్వీట్‌ చేశారు. దానికి ధనుష్‌ స్పందిస్తూ థ్యాంక్స్‌  చెప్పడం, ఆ వెంటనే రుస్సో బ్రదర్స్‌ మళ్లీ స్పందించడం జరిగిపోయాయి. ఇదిలా ఉంటే జగమే తందిరం ఈ మధ్యాహ్నం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ కాబోతోంది. తమిళ్‌, తెలుగుతో సహా పదిహేడు భాషల్లో 190 దేశాల్లో ఈ  మూవీ అలరించనుంది. 

ధనుష్ హాలీవుడ్‌లో ‘ది గ్రేమ్యాన్‌’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రుస్సో బ్రదర్స్‌ డైరెక్షన్‌ వహిస్తున్నారు. ఈ మూవీని కూడా నెట్‌ఫ్లిక్స్‌ నిర్మిస్తోంది. ఈ చొరవతో ఈ హాలీవుడ్‌ దర్శకులు ధనుష్‌కు విషెస్‌ చెప్పారన్నమాట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top