
పెళ్లి ప్రస్తావన ఎత్తితేనే ముఖం తిప్పుకునేదాన్ని. నేనంత రొమాంటిక్ కాదు, చాలా ప్రాక్టికల్ పర్సన్‌ను. అందుకే అసలు పెళ్లే చేసుకోకూడదనుకున్నా.. ఎప్పటికీ సింగిల్‌గా ఉండిపోవాలని ఫిక్సయ్యా. కానీ మనకు సరైన వ్య
పెళ్లంటే నాకు చిరాకు, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని డైలాగులు చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఆ మాట మీద నిలబడేవాళ్లను మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. కళ్యాణం వచ్చినా కక్కచ్చినా ఆగదంటారు కదా.. అలాంటి శుభ ఘడియలు వచ్చాయంటే ఎవరెన్ని అనుకున్నా చివరికి పెళ్లిపీటలెక్కాల్సిందే! ఏడడుగులు నడవాల్సిందే! తన విషయంలో కూడా అదే జరిగిందంటోంది నటి, దర్శకనిర్మాత నీతూ భజ్వా.
'పెళ్లి ప్రస్తావన ఎత్తితేనే ముఖం తిప్పుకునేదాన్ని. నేనంత రొమాంటిక్ కాదు, చాలా ప్రాక్టికల్ పర్సన్‌ను. అందుకే అసలు పెళ్లే చేసుకోకూడదనుకున్నా.. ఎప్పటికీ సింగిల్‌గా ఉండిపోవాలని ఫిక్సయ్యా. కానీ మనకు సరైన వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు గుండెలో గంటలు మోగడం, ప్రకృతి స్థంభించిపోవడం వంటివి జరుగుతాయంటారు కదా! హ్యారీని చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. మొదటి చూపులోనే అతడిని నేనే పెళ్లాడబోయేది తానేనని అర్థమైంది. నా సోదరికి అతడు తెలుసు కాబట్టి మా పెళ్లి చాలా ఈజీగా జరిగిపోయింది. పెళ్లయ్యాక నేను మరింత సక్సెస్‌ఫుల్ అయ్యాననిపిస్తోంది' అని చెప్పుకొచ్చింది.
కాగా నీతూ 1998లో వచ్చిన మై సోలా బరాస్ కీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తర్వాత అస్తిత్వ.. ఏక్ ప్రేమ్ కహానీ, జీత్, గన్స్ అండ్ రోజెస్ సీరియల్స్‌తో బుల్లితెరపై సందడి చేసింది. అనంతరం షాదీ లవ్ స్టోరీ, జట్ అండ్ జూలియట్ 2, నాటీ జట్టాస్ అనే పంజాబీ చిత్రాల్లో నటించింది.
చదవండి: అంబానీ ఇంట్లో ఫంక్షన్‌కు ఆ డ్రెస్‌లో వెళ్తావా? నటుడిపై ట్రోలింగ్
నిర్మాత మహేశ్ భట్‌కు సర్జరీ