
Nayanthara Surprises Vignesh On His Birthday: లేడీ సూపర్‌స్టార్ నయనతార.. కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌కు గ్రాండ్‌గా సర్‌ప్రైజ్ ఇచ్చింది. శనివారం విఘ్నేశ్ 36వ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ పార్టీతో ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన ఫోటోలను విఘ్నేశ్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ సందర్భంగా.. నీ ఉనికి నా జీవితంలో ఏ బహుమతితో పోల్చలేనిది..థ్యాంక్యూ థంగమే(నయన్‌ని ఉద్దేశించి) నా బర్త్‌డేను మరింత స్పెషల్‌గా మార్చినందుకు అంటూ నయన్‌పై ప్రేమ కురిపించాడు.
ఇక తన పుట్టినరోజుకు విషెస్ తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా తాను దర్శకత్వం వహిస్తున్న కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతుందని ప్రకటించాడు. కాగా ఈ సినిమాలో నయనతారతో పాటు సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా గత నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న నయన్-విఘ్నేశ్‌లు ఇటీవలె నిశ్చితార్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీనికి సంబంధించి అతి త్వరలోనే ముహూర్తం తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు.