'క‌ళ్ల‌లో నీళ్లు తిరుగుతున్నాయి, త్వ‌ర‌లోనే నిజం చేస్తా'

Music Director SS Thaman Emotional Over This Viral Video - Sakshi

"ప్రార్థించే పెద‌వుల క‌న్నా సాయం చేసే చేతులు మిన్న" అంటారు. ఈ సామెత‌ను నిజం చేశాడో వ్య‌క్తి. క‌డుపు నిండా తిని ఎన్ని రోజులైందో ఓ పండు ముస‌లావిడ త‌న ఆక‌లి ఎవ‌రైనా తీర్చ‌క‌పోతారా? అని రోడ్డు మీద ఆశ‌గా నిరీక్షిస్తోంది. ఆమె ఆక‌లిని ప‌సిగ‌ట్టిన ఓ వ్య‌క్తి ఆహారం పొట్లంతోపాటు ఓ వాట‌ర్ బాటిల్‌ను తీసుకెళ్లి ఆమెకు అందించాడు. హ‌మ్మ‌య్య‌.. ఈ పూట‌కు ప‌స్తులుండ‌క్క‌ర్లేదు అని సంబ‌ర‌ప‌డిపోయిందా పెద్దావిడ‌. దీనికి డ‌బ్బులేమైనా తీసుకుంటారునుకుందో ఏమో కానీ చీర కొంగులో దాచుకున్న డ‌బ్బును ఇవ్వ‌బోగా అత‌డు సున్నితంగా తిర‌స్క‌రించాడు.

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అవ్వ క‌ళ్ల‌లో ఆనందం చూసి నెటిజ‌న్లు భావోద్వేగానికి లోన‌వుతున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ కూడా ఈ వీడియో చూసి ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఈ దృశ్యం చూసి నా గుండె పగిలింది అని ఆవేద‌న చెందాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ క‌ట్టాల‌న్న కొత్త ఆశ‌యం త‌న మ‌న‌సులో నాటుకుంద‌ని చెప్పాడు. త్వ‌ర‌లోనే దీన్ని నిజం చేస్తాన‌ని, ఇందుకుగానూ ఆ భ‌గ‌వంతుడు త‌న‌కు బ‌లాన్ని ఇస్తాడ‌ని ఆశిస్తున్నానన్నాడు. 'క‌ళ్ల‌లో నీళ్లు తిరుగుతున్నాయి. ద‌య‌చేసి ఆహారాన్ని వృధా చేయ‌కండి. వీలైతే అవ‌స‌ర‌మైన‌వారికి ఆహారాన్ని అందించండి' అని కోరాడు.

చ‌ద‌వండి: టాలీవుడ్‌లో మరో విషాదం.. పూజా హెగ్డే ఎమోషనల్‌ ట్వీట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top