Maha Samudram: ‘మహాసముద్రం’లోని ట్విస్ట్‌లు అంచనాలకు అందవు: మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్

Music Director Chetan Interview about Maha Samudram Movie - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 వంటి బ్లాక్‌ బ​స్టర్‌ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మహా సముద్రం’.  శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా చేస్తున్న ఈ మూవీలో అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నాడు.  దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతున్న ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మీడియాతో ముచ్చటించారు. వివరాలిలా..

ఎంతో ఇన్‌టెన్సిటీ ఉన్న ఎమోషనల్‌ లవ్‌స్టోరీ ‘మహా సముద్రం’. ఈ  చిత్రం చూసిన తర్వాత ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్లారు. చివరి 40 నిమిషాలు సినిమా ఎంతో ఎక్సైట్‌మెంట్‌ని ఇస్తుంది. 

అమాయకంగా ఉండే మనుషుల జీవితాల్లో వచ్చే మార్పుల సమాహారమే ఈ చిత్రం. ఇలాంటి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇవ్వడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. అంద‌రి అంచనాలు మించేలా సినిమా ఉంటుంది.

మ్యూజిక్ అనేది కథకు అనుగుణంగానే ఇస్తాను. కథ బాగుంటే.. మ్యూజిక్ కూడా బాగుంటుంది. కథను బట్టే మ్యూజిక్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటాను.

ఆర్ఎక్స్ 100 సినిమాలో కంటే ఎక్కువ ట్విస్ట్‌లు మహాసముద్రంలో ఉంటాయి. అంటే దాదాపు ఐదారు ఉంటాయి. అవి ప్రేక్షకుల అంచనాలకు అందవు. ఒక అతీంద్రియ శక్తితో పాటు.. టైం, విధి మనిషిని ఎన్ని రకాలుగా మార్చుతుందనేది చూపించబోతున్నాం.

ఆర్ఎక్స్ 100 సినిమాకు చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. దీంతో ఈ సినిమాకు ఒళ్లు దగ్గరపెట్టుకుని మరింత జాగ్రత్తగా మ్యూజిక్‌ అందించాను. కచ్చితంగా ఇందులోని అన్ని పాటలు ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాయి.

మహా అనే క్యారెక్టర్‌లో చాలా ఆసక్తిని రేపుతుంది. ఆమె జీవితంలో జరిగే సంఘటనలు చుట్టూ ఉన్న వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనేది కథ.

కొన్ని జానర్స్ మూవీ సెంట్రిక్‌గా చేయాల్సి ఉంటుంది. మూవీలో ఆ పర్టిక్యులర్ సీన్‌లో వచ్చే పాట ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే.. ఆ పాట హిట్టైనట్టే. ఆర్ఎక్స్  100 సినిమాకి అదే మ్యాజిక్‌ వర్కౌట్‌ అయ్యింది.  ఈ సినిమాలో  నాకు చెప్పకే చెప్పకే అనే పాట ఎక్కువగా ఇష్టం.

దర్శకుడు కథను ఎంతో క్లియర్‌గా, డీటైల్డ్‌గా నాకు చెప్పారు.  లైవ్ బేస్డ్‌ ఎలిమెంట్స్ చేసే స్కోప్ ఇచ్చారు.

ప్రతీ ఒక్కరూ అద్బుతంగా నటించారు. ఇంత ఇంటెన్స్ ఉన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండరు. ప్రతీ ఒక్క పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్  చేయడం చాలా కష్టంగా అనిపించినా.. ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను.

చైతన్య ప్రసాద్, భాస్కరభట్ల, కిట్టు విశ్వప్రగడ అందరూ అద్భుతంగా రాశారు. సినిమాలోని ఎమోషన్‌ను ముందుకు తీసుకెళ్లలా వారి పాటలు ఉన్నాయి.

బ్యాక్ గ్రౌండ్ కన్నా.. సాంగ్స్ చేయడమే నాకు ఇష్టం. పాటలు చేయడంలో ఫ్రీడం ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎక్స్ 100 లో రుధిరం, ఎస్ఆర్ కళ్యాణమండపంలోని చుక్కల చున్నీ బాగా ఇష్టం. 

పాటలు ఎప్పుడూ కూడా సినిమాకు తగ్గట్టే ఉండాలి.  పాటలను బట్టే సినిమాలను చూస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాకు అంత ఆదరణ ఇచ్చినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. నా జర్నీ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.

చదవండి: ఇండియాకు తిరిగి వచ్చాను, కోలుకుంటున్నా: హీరో సిద్ధార్థ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top