మునీష్‌కాంత్‌ ప్రధాన పాత్రలో ‘మిడిల్‌ క్లాస్‌’ చిత్రం | Munishkanth, vijayalakshmi Latest Movie Title is middle Class | Sakshi
Sakshi News home page

మునీష్‌కాంత్‌ ప్రధాన పాత్రలో ‘మిడిల్‌ క్లాస్‌’ చిత్రం

Published Sat, Jun 25 2022 10:45 AM | Last Updated on Sat, Jun 25 2022 10:45 AM

Munishkanth, vijayalakshmi Latest Movie Title is middle Class - Sakshi

నటుడు మునీష్‌కాంత్‌ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రానికి మిడిల్‌ క్లాస్‌ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రం బృందం. రాక్షసన్‌, ఓ మై కడవలే, బ్యాచిలర్‌ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన యాక్సెస్‌ ఫలిం ఫ్యాక్టరీ సంస్థ అధినేత జి. డిల్లిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నటి విజయలక్ష్మి అగస్థ్యన్‌, రాధాదేవి, మాళవిక అవినాష్‌ తదితరులు ముఖ్యాపాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా కిషోర్‌ ముత్తురామలింగం దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

దీనికి సంతోష్‌ దయానిధి సంగీతాన్ని, సుదర్శన్‌ శ్రీనివాసన్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు. గురువారం చెన్నైలో లాంచనంగా ప్రారంభమైన ఈ చిత్ర వివరాలను నిర్మాత వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్య తరగతి కుటుంబ నేపథ్యంలో సాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ నెల27వ తేదీ నుంచి షూటింగ్‌ ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement